మన్యం న్యూస్, మణుగూరు, జనవరి28: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కేసీఆర్ న్యూట్రియేషన్ కిట్స్ పంపిణి చేశారు. డాక్టర్ శివకుమార్ ఆసుపత్రిలో 23 మంది గర్భిణీ స్త్రీలకు కిట్స్ ను అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కిట్స్ లో పోషకాహార పదార్థాలు కర్జూరం, హార్లిక్స్, ఐరన్ సిరప్స్ ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రక్త హీనత తో బాధపడుతున్న వారికి మంచి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు కావాలని, కాన్పు ఐనవారికి కేసీఆర్ కిట్, నగదును అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.