మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 28… మండల పరిధిలోని నారావారి గూడెం కాలనీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. వారికి వేద బ్రాహ్మణులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొని అన్నదాన కార్యక్రమం తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నారం శ్రీనివాసరావు, దుర్గారావు వెంకటేశ్వరరావు రాజేష్ గోవిందరావు నారం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.