UPDATES  

 కళాశాలకు సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తా విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండరాదు కళాశాల ప్రిన్సిపల్ నెల్లూరు శేషుబాబుతో ముచ్చటించిన ఎమ్మెల్యే రేగా

 

మన్యం న్యూస్, పినపాక:

మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు. ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును గెలుపొందినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు ఎమ్మెల్యే రేగాకాంతారావుకు కళాశాలకు సంబంధించిన పలు సమస్యలను వివరించారు. విద్యార్థులు మూత్రశాలలకు సంబంధించి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, గతంలో ఈ పనులు నిర్వహించిన గుత్తేదారు తూతూ మంత్రంగా నిర్మాణం చేయడం వలన కొన్ని రోజులకే మూత్రశాలలు నిరుపయోగంగా మారాయని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. విద్యార్థులకు ఐటిసి సంస్థ నుండి వచ్చే పుస్తకాల సరఫరా ఆగిపోయిందని, దానికి పరిష్కారం చూపించాలని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మంచినీటి కోసం నూతన ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న మూత్రశాలలను పూర్తి చేయిస్తామని, ఆ ప్రదేశంలోనే గుత్తేదారుకు తెలియజేశారు. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాల గురించి మాట్లాడతానని, చదువు విషయంలో విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకూడదని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి ఈ సైదులు రెడ్డి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !