వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మూడోసారి కూడా సీఎం కేసీఆర్
మాయ, మోసపు మాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి
రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ది
ఎంపీ నామా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 28:. అధికారులకు తిరిగి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు శనివారం అశ్వరావుపేట మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ లోకసభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 37 మందికి రూ.13 లక్షల విలువైన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మెచ్చాతో కలసి పంపిణీ చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు. ఈ సందర్భగా ఎంపీ నామా మాట్లాడుతూ మరల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నూటికి నూరు శాతం ఇదే నిజం అని మూడోసారి మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఆయన అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన లబ్దిదారులకు ఎంపీ నామ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ ఎవరెన్ని మాయ, మోసపు మాటలు చెప్పినా రానున్నది బీఆర్ఎస్
ప్రభుత్వ మేనని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి కనిపించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి పక్క రాష్ట్రాల వారు ఫిదా అయి తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కొంతమందైతే తమల్ని. తెలంగాణ లో కలపాలని కోరుతున్నారని అన్నారు. ఇటువంటి సీఎం ఎక్కడ లేరని, అందుకే బీఆర్ఎస్ స్థాపన జరిగిందని అన్నారు. యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వం లో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుందని తెలిపారు. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. అన్ని రంగాలు గణనీయమైన ప్రగతిని సాదించాయన్నారు. తలసరి ఆదాయంలో కూడా నెంబర్ వన్ గా ఉన్నామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు వస్తే యావత్ జిల్లా మొత్తం సశ్యామలం అవుతుందన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరందుతుందని అన్నారు. రానున్న కాలంలో కేసీఆర్ కు కొండంత అండగా ఉండి, గెలిపించుకొని, మరింత అభివృద్ధిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి, రమ్య, సోయం ప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, గోడ్డేటి మాధవరావు, గారపాటి సూర్యం, అబ్దుల్ జిన్నా, ఫనీంద్ర, మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు