రూ.1.56 కోట్లతో
అదునాతన సౌకర్యాలతో పినపాకలో ఆసుపత్రి
నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేగా
100 పడకల ఆసుపత్రి మాదిరిగానే పినపాకలో ఆసుపత్రి నిర్మాణం
.
మన్యం న్యూస్, పినపాక, జనవరి 28
మండలంలోని పినపాకలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో పంచాయతీ రాజ్ నిధులతో రూ.1.56కోట్లతో వ్యయంతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి శనివారం తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. పినపాక మండలంలోని ప్రజానీకానికి ఆధునిక సౌకర్యాలతో మణుగూరులోని వంద పడకల ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోకుండా, సకల సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం జరగనుందని, పినపాక మండల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందనుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వైద్యరంగంలో కూడా వినూత్న మార్పులను తీసుకొస్తుందని తెలియజేశారు. దీనిలో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా పిన పాక మండలానికి చెందిన డాక్టర్ దుర్గాభవాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులుగా నియమించబడడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఇ సైదులు రెడ్డి, ఏ ఈ రైనాల్డ్స్, మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.