మన్యం న్యూస్ గుండాల జనవరి 28.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న మతోన్మాదానికి యువకులంతా కలిసికట్టుగా పోరాడాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో చీమల గూడెం గ్రామంలో ఏడవ మహాసభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఓట్ల కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. వీరి పుత్రాలను పిచ్చి కొట్టే విధంగా యువకులంతా సంఘటితమై పోరాడాలని ఆయన అన్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐలయ్య, కుండాల సర్పంచ్ సీతారాములు, పార్టీ నాయకులు నరేష్ , వై వెంకన్న, జిల్లా కార్యదర్శి రవి, లాజర్, మంగన్న , తదితరులు పాల్గొన్నారు