మన్యం న్యూస్ గుండాల, జనవరి 28 ..ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు కోరారు. శనివారం మార్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 30వ తారీఖున ఆళ్లపల్లి మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించనున్నారని ఆయన పర్యటనకు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కోపరేటివ్ చైర్మన్ రామయ్య, సర్పంచ్ శంకర్ బాబు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ ,పార్టీ నాయకులు ఎండి ఖయ్యూం, కిషోర్ బాబు, వెంకటేష్ , యాసారపు బాబు, వెంకన్న, ఎండి ఆదాం, తదితరులు పాల్గొన్నారు .