మన్యం న్యూస్, మణుగూరు, జనవరి28: పదవతరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చాలని మణుగూరు ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. ఆయన శనివారం మణుగూరు జడ్పి కో-ఎడ్యుకేషన్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు చెప్పినట్టుగా చక్కగా చదువుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలన్నారు. పరీక్షలు అంటే భయపడకూడదని, ఇష్టంతో రాస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు.