మన్యం న్యూస్, మణుగూరు:ఏ ఒక్క భూ నిర్వాసిత కుటుంబానికి అన్యాయం జరగనివ్వను అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుఅన్నారు. మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఆదివారం ఎమ్మెల్యే రేగా బీటీపీఎస్ రైల్వే లైన్ నందు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ &ఆర్ ప్యాకేజీ కింద సమితి సింగారం సర్వేనెంబర్ 314, రామానుజరం సర్వేనెంబర్ 853 నందు కేటాయించిన ఇండ్ల ఫ్లాట్లకు సంబంధించి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈసమావేశంలో జెసి కర్నాటి వెంకటేశ్వర్లు, ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పిటిసి పోశం నరసింహారావు, తాసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.