మన్యం న్యూస్, మణుగూరు, జనవరి29: ప్రతి ఒక్కరం కలిసి ఐక్యంగా పనిచేద్దామని పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ధనసరి సూర్య అన్నారు. ఆయన ఆదివారం మణుగూరు మండలం తోగ్గూడెం శివమ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం అందరం కలిసి పని చేయాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రావుల కృష్ణ, ఆదివాసీ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, పినపాక యువజన నాయకులు, పోతే రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చందా వర ప్రసాద్, ప్రజావధి, నాగరాజు, జర్పుల నాయక్, పోనిగోటి పుర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.