UPDATES  

 ఏసీడిటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జాతీయ ప్రధాన రహదారి హైవే పై రాస్తా రోకో

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జనవరి 29: మండల కేంద్ర పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో కరెంటు చార్జీలు పెంపుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ ప్రధాన రహదారి పై రాస్తా రోకోలు ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షలు వనమా గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని సామాన్య ప్రజలపై భారం,ఒత్తిడి పడుతుందని చెప్పారు.కరెంటు బకాయిలు పెంచడమే గాని కరెంటు సరిగా అందజేయడం లేదని ఇలా అయితే రైతులు పంటలు పండించడానికి కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించింది వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రధాన రహదారి హైవేపై ఉన్న లైట్లు నిరంతరం సరిగా వెలగడం లేదని దాని వల్ల యాక్షిడెంట్ లు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు గానీ వెంటనే స్పందించిన ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి ఆర్ అండ్ బి ఏఈ కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి,అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ నాయకులు చల్లా పుల్లయ్య, ఇనపనురి జామలయ్య,రాజాపురం గ్రామ అధ్యక్షులు దావారామయ్య,ఎనిగంటి ప్రసాదు ఎర్రగుంట గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !