మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29… ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం ఏ ఏపాటిదంటు చాటి చెప్పడమే కాకుండా హద్దులు చెరిపే ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగిపోతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఈ కార్యక్రమంలో భాగంగా వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నిరంగల్లో రాణిస్తూ ఎవరిపై ఆధారపడకుండా స్వసక్తిగా సమాజంలో ఎదగడమే కాకుండా ఎందరుకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దివ్యాంగులు పట్ల వివక్షత చూపకుండా వారికి అన్ని రంగాల్లో సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఎవరికి ఏ సహాయం అందించాలన్న తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండపనేని సతీష్, ప్రవీణ్ కుమార్, లగడపాటి రమేష్, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు ,బిజెపి నాయకులు రంగా కిరణ్, నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, తదితరులు పాల్గొన్నారు.