మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29… వార్త కథనాలతో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ సంచలమైన కథనాలను ప్రచురింపజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మన్యం న్యూస్ ప్రధాన పత్రికలకు దీటుగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల ఆధ్వర్యంలో దివ్యాంగుల దివ్వోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడుగా మన్యం న్యూస్ దినపత్రికకు సేవలందిస్తున్న జిల్లా ప్రతినిధి సీమకుర్తి రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అనతి కాలంలోనే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలను వెలికితీస్తూ అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మన్యం న్యూస్ దినపత్రిక వారధిగా నిలబడిందని అభివర్ణించారు. మన్యం న్యూస్ దినపత్రికను నెరవేస్తున్న యాజమాన్యానికి జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయ వర్గానికి దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండపునేని సతీష్, ప్రవీణ్, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, బిజెపి నాయకులు రంగా కిరణ్, తదితరులు పాల్గొన్నారు.