UPDATES  

 ఆదివాసీల పైన దాడి చేసిన గిరిజనేతరుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలి…ఊకె రవిని ఫోన్ లో బెదిరించిన మాజీ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలి.

మన్యం న్యూస్ ,నూగుర్ వెంకటాపురం:
ములకలపల్లి మండలం లోని మూత్యాలం పాడు గ్రామంలో ఆదివాసీ విద్యార్థుల పైన గిరిజనేతరులు దాడి చేయడాన్ని ఆదివాసీ నవ నిర్మాణసేన తీవ్రంగా ఖండిస్తుంది అని ఆ సంఘం నాయకులువాసం నాగరాజు అన్నారు. ఎన్. ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గిరిజనేతరుల చేత దాడి చేపించినట్లు బాధిత ఆదివాసీ యువత చెప్తున్నట్లు ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతాటి వెంకటేశ్వర్లు తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టు వ్యాహవరిస్తున్నాడు అని విమర్శించారు. అమాయక ఆదివాసీ విద్యార్థుల పైన తప్పుడు కేసులు పెట్టించడమేమిటి అని మాజీ ఎమ్మెల్యే పైన మండిపడ్డారు.ఆదివాసీలను అణచివేయాలని చూసిన మాజీ ఎమ్మెల్యే ను జాతి ద్రోహి అన్నారు. ఆదివాసీ సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఊకె రవి పైన ఫోన్ లో దుర్భాషాలాడి, తప్పుడు కేసులు బనాయించాలని చూసిన మాజీ ఎమ్మెల్యే పైన కూడా కేసులు నమోదు చేయాలనీ వాసం నాగరాజు డిమాండ్ చేశారు. గిరిజనేతరుల మోచేతి నీళ్లు త్రాగుతూ, వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న మాజీ ఎమ్మెల్యే జాతి ద్రోహి అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో అశ్వారావుపేట నియోజక వర్గంలోని ఆదివాసీల పైన అనేక తప్పుడు కేసులు పెట్టినట్లు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారని తెలియజేశారు. షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలను గిరిజనేతరులకు తాకట్టు పెడుతున్న మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళకు ఆదివాసీలు తప్పకుండ బుద్ది చెప్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !