పినపాక భగీరథుడు..
ఎమ్మెల్యే రేగా కు మెమొంటోనీ బహుకరించిన మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
మన్యం న్యూస్,అశ్వాపురం:మండల పరిధిలో ని
తుమ్మల చెరువు కు గోదావరి జలాలు తరలించే మారేళ్లపాడు ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు నుఆదివారం మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి శాలువా తో ఘనంగా సన్మానించి మెమొంటోనీ బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వాపురం మండల రైతాంగం కష్టాలను తీర్చి, 17వేల ఎకరాలకు సాగు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం భగీరథుడు అని ప్రశంసించారు. అన్ని రంగాలలో పినపాక నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావును భవిష్యత్తులో కూడా ఆశీర్వదిస్తే , అభివృద్ధిని రేసుగుర్రంలా పరిగెత్తిస్తాడని అన్నాడు. ఇలాంటి గొప్ప నాయకుడు పినపాక గడ్డలో జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు.