అభివృద్ధి కావాలా.. పనిచేయని వాళ్ళు కావాలా….
– వద్దన్నా పండు ఎద్దును లేపుతున్నారు.
-దానివల్ల అసలే ఉపయోగం లేదు.
– మీ ఆశీర్వాదం ఉంటే మరింతగా అభివృద్ధి చేస్తా.
– ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.
– పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
– శేషగిరి నగర్ లో 700 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి29: అభివృద్ధి కావాలా పనిచేయని వాళ్ళు కావాలా మీరే తేల్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి నగర్ గ్రామంలో 700ల కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీల చేరిన వారందరికీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న పండెద్దు లేవలేని పరిస్థితిలో ఉందని, అయినా దానిని ముల్లు గర్ర పెట్టి గుచ్చి లేపుదామనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పండెద్దు వల్ల ఒరిగేదేమీలేదన్నారు. నియోజకవర్గంలో ఊహించిన అభివృద్ధి జరుగుతుందని, అది వాళ్ల కళ్ళకు కనిపించడం లేదన్నారు. ప్రజల అధికారం ఇస్తే పనిచేయడం చేతగానోళ్లు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పిల్లల కోసం వాలీబాల్ కిట్లను అందజేస్తున్నానని, మాకంటే ముందే కిట్లను పంచుతున్నారన్నారు. మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఇంటి ముందు రోడ్డు వేసుకొని వాడు ప్రజలకు ఏం చేస్తాడన్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదం ఉంటే మరిన్ని నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఆయన హయాంలో వంద పడకల హాస్పిటల్ లో కనీసం డాక్టర్లను కూడా తీసుకురాలేదని, నేను వచ్చాక అందరు డాక్టర్లను తీసుకువచ్చానని, 24 గంటలు ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ, అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యం బాబు, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్, రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు, సాగర్ యాదవ్, యూసఫ్ షరీఫ్, నూకారపు రమేష్, సంజీవరావు, వేముల లక్ష్మయ్య, వేమూరి రఘు, రమాదేవి, చంద్రకళ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.