మారుమూల ఆళ్లపల్లి మండలంలో విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, పరామర్శలు చేయడం జరిగింది. మండల ప్రజానీకానికి అన్ని విధాల ఆసరా అవుతున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆడపడుచులు మంగళహారతులతో ఆశీర్వదించారు. తమ అభిమాన నాయకుని పై పూలు జల్లుతూ ప్రేమను చాటుకున్నారు.ఆళ్లపల్లి మండలం లో రేగా పర్యటనతో బి.ఆర్.ఎస్ శ్రేణులలో ఫుల్ జోష్ పెంచింది.