మన్యం న్యూస్ గుండాల: మండలంలోని ప్రతి పల్లె అభివృద్ధిపరిచే బాధ్యత నాదేనని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి పూర్తయిన పనులను ప్రారంభించారు. మండలంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో మండలాన్ని ముందు వరుసలో నిలిపారని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పల్లెకు రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు ఎంతో కృషిచేసినట్లు ఆయన అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నుండి బందేల దొడ్డి వరకు 75 లక్షల రూపాయలతో సిసి రోడ్డును మంజూరు చేసి అనధి కాలంలోనే పూర్తి చేసి దానిని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో వెంకటాపురం వెళ్లాలంటేనే నరకయాతన అనుభవించే పరిస్థితి ఉండేదని అలాంటి దాన్ని గమనించి రహదారితో పాటు3 కోట్ల 50 లక్షల రూపాయలతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు దానితోపాటు సీతానగరం వద్ద జల్లేరు వాగుపై 5 కోట్ల 25 లక్షల రూ