మన్యం న్యూస్, అశ్వరావుపేట, జనవరి 30: మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామపంచాయతీ ఎంపీయుపిఎస్ పాఠశాలలో సర్పంచ్ సాదు జోత్నా భాయ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పాఠశాల విద్యార్థులతో కలిసి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మణి, టీచర్ అనురాధ, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.