మన్యం న్యూస్ గుండాల: కంటి వెలుగు ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం ఆళ్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన అనంతోగు ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించి కండ్లజోళ్లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలలో మరో అద్భుతమైన పథకం కంటి వెలుగు పథకం అని ఎన్నో ఏళ్లుగా అంధకారానికి గురైన వృద్ధులకు ఈ పథకం ద్వారా తిరిగి చూపు వచ్చిందన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలను సైతం ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని అన్నారు