మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక
రాజకీయాలకు అతీతంగా మాదిగల ఐక్యత.
ఫిబ్రవరిలో 10 వేల మంది తో ఆత్మీయ సమ్మేళనం: నియోజకవర్గ అధ్యక్షుడు రావులపల్లి రామమూర్తి*
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:
పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక కార్యాలయాన్ని మణుగూరు కేంద్రంగా సోమవారం నాడు ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని,నియోజవర్గంలోని ఏడు మండలాల మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలతో,నివాళులర్పించారు.అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన మాదిగ సోదరులందరూ జై భీమ్ నినాదాలతో నియోజకవర్గ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకొని,మాదిగ ఐక్యవేదికల ప్రాంతీయ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కుర్రి.రాజేశ్వర్ రావు చేతుల మీదుగా అలాగే,ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రముఖ జర్నలిస్టు మాచర్ల శ్రీను ప్రారంభించారు. అనంతరం మాదిగ ఐక్య వేదిక నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం లో మాదిగ ఐక్యవేదిక పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ,నియోజకవర్గ మాదిగల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా, ఎదగడానికి మాదిగలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల కమిటీలు ఏర్పాటు చేసామని మని ఆయన తెలిపారు. మాదిగల ఐక్యతే,ఐక్య వేదిక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఫిబ్రవరిలో మాదిగ సమ్మేళనం ఏర్పాటు చేసి సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 7000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.ఏ సంఘానికి లేనివిధంగా మణుగూరు ప్రాంతంలో మాదిగల ఐక్యవేదిక నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించడం అంటేనే మా ఐక్యత కు నిదర్శనమని అన్నారు.రానున్న రోజుల్లో మాదిగలు మహాశక్తి గా తయారు చేసి మా హక్కులను మేమే సాధించుకుంటామని ఆయన తెలిపారు.ఐక్యవేదిక ద్వారా ప్రతి మాదిగ కుటుంబాన్ని మాదిగ జాతిని రక్షించుకొని ముందుకు సాగుతూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని ఆయన అన్నారు.అంబేద్కర్ వారసులుగా,అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా రాజకీయంగా ఆర్థికంగా అసమానతలు పోగొట్టే విధంగా సమాజంలో పేరుకుపోయిన అంటరానితన నిర్మూలనే లక్ష్యంగా,మాదిగల ఐక్యవేదిక ముందుకు సాగుతుందని ఆయన తెలియజేశారు.ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుండి తరలివచ్చిన మాదిగ జాతి మహనీయులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ,ట్రెజరర్ నల్లగట్ల రఘు, మీడియా సెల్ ఇంచార్జ్ సిద్దెల తిరుమల రావు,సహాయ కార్యదర్శి పొడుతూరి విక్రమ్, గొల్లపల్లి నరేష్,లింగంపల్లి రమేష్,ఐటీసీ ఉద్యోగులు కేసుపాక నరసింహారావు, మిరియాల నరసింహారావు, ఇస్రం శ్రీను,రాజబాబు, అవులూరి రమేష్,లాయర్లు గద్దల సాంబ,అశోక్, తదితరులు పాల్గొన్నారు.