మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆళ్లపల్లి మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు అబ్బు నాగేశ్వరరావు సతీమణి అనారోగ్యానికి గురై కోలుకొనిఇంటికి వచ్చిన తరుణంలో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. రేగా వీర అభిమాని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు ఎండి ఆదాం అక్క కూతురు ప్రమాదానికి గురవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆదం కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని మరోసారి ఇచ్చారు