మన్యం న్యూస్ ఇల్లందు జనవరి 30 :- ఇల్లందు శుభాస్నగర్,కోమరారం,లచ్చగుడెం కరెంట్ సబ్ స్టేషన్స్ ముందు న్యూడెమోక్రసీ అధ్వర్యంలో అడిషనల్ కంజెంపేషన్ డిపాజిట్ (ఏసిడి) రూపంలో ఎక్స్ట్రా కరెంట్ చార్జెస్ వసూళ్లను వెంటనే రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో న్యూడెమోక్రసీ నాయకులు తుపాకుల నాగేశ్వరావు,కొక్కు సారంగపాణి,బోగ్గారపు సంగయ్య మాట్లాడుతూ ఏసీడి చార్జెస్ ను వెంటనే రద్దు చేసి అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సబ్ స్టేషన్ అధికారికి వినతి పత్రం సమర్పించారు.సమస్య పరిష్కరిచని దశలో ప్రతిఘటన తప్పదని తెలియ జేశారు.ఈ కార్యక్రమాలలో సూర్ణపాక నాగేశ్వరరావు, రామిశెట్టి నర్సింహారావు,కోడి శ్రీరాములు, రసాల లింగం, రేపాకుల శ్రీను, చంద్రు,కమటం వెంకన్న,ఇర్ప భద్రయ్య, పర్షిక రాజేశ్వరి, వేప రాణి, బొర్రయ్య,రేపాకుల వెంకన్న, బత్తుల వెంకన్న, బుచ్చిరాములు,జీవన్,బిచ్చా, హచ్చ,కృష్ణ,చిన్న, తదితరులు పాల్గొన్నారు.