UPDATES  

 పర్యావరణ పరిరక్షణ చట్టాలను పాటించాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 30…. పర్యావరణ పరిరక్షణ చట్టాలను ప్రతి ఒక్కరు పాటించాలని పాటించని వారు శిక్షార్హులవు తారని జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గ ఆధ్వర్యంలో సోమవారం జంతు సంక్షేమంపై సమావేశం ఐ డి ఓ సీ హాల్లో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి భారత పౌరుడు పర్యావరణ పరిరక్షణ చట్టం, వన్య ప్రాణి సంరక్షణ చట్టం, జంతు హింస నివారణ చట్టం ను, తప్పక పాటించాలని, లేనిచో శిక్షార్హుడు అవుతారని తెలిపారు.జంతువులను, పక్షులను, నీటిలో బ్రతికే జీవాలను హాని కలిగించరాదు, వాటి అవసాలను నాశనం చేయరాదని. పక్షులు నివాసం ఉన్న వృక్షా లను నరకరాదని, జంతు సంరక్షణకు కు భారత ప్రభుత్వంఅనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను స్థాపించడము జరిగినదన్నారు.రాష్ట్రంలో రాష్ట్ర జంతువు సంక్షేమ బోర్డు, జిల్లాలో కలెక్టర్ అధ్యక్షులుగా, సంబంధిత శాఖ
అధికారులు , జంతు సంక్షేమ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా జిల్లా జంతు హింస
నివారణ సంఘాలను స్థాపించడం జరిగిందన్నారు. వీధులలో తిరిగే జంతువుల పట్ల కరుణతో
వ్యవహరించాలని, వాటికి ఆహారం త్రాగునీరు అందించాలని హింసకు గురి చేయరాదని తెలిపారు.
పెంపుడు జంతువులనకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలను వేయించాలని. ఎట్టి పరిస్తితులలో
నిర్ధాక్షణ్యముగా బయట వదిలేయరాదని. పశువులను రవాణా చేయునప్పుడు నిబంధనలు పాటించాలని,లేని యెడల శిక్షార్హులు అవుతారని తెలిపారు.ఎవరైనా వన్యప్రాణులను గమనించినట్లయితే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చివాటిని సురక్షితఅటవి ప్రాంతానికి తరలించుటకు సహకరించాలన్నారు. వీధి కుక్కలను చంపుట హింసించుట చట్టరీత్యా నేరమని.
బహిరంగ ప్రదేశంలో జంతువధ చేయరాదని, జంతు సంరక్షణ సేవ చేయువారికి స్వచ్ఛంద సంస్థలకు ప్రతి
పౌరుడు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి. పురంధర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పి డి వి. ఆంజనేయ శర్మ, ప్రసాదరావు, జేవీఎస్ చంద్రశేఖర్. తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !