మన్యం న్యూస్ ,సారపాక:
జాతిపిత మహాత్మాగాంధీ వర్దంతి ని సోమవారం ఐటీసీ శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలిస్ యూనియన్-టిఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలోమండల పరిధిలోని సారపాక ప్రధాన కూడలిలో ఘనంగా నిర్వహించారు. తొలుత మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించి శాంతియుత మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానేత అన్నారు..ఈ కార్యక్రమంలో పూదోట అంతయ్య,బాల్ రెడ్డి,పోటు నరసింహారావు,ఇన్నయ్య,రమేష్,బిష్మా రెడ్డి, గోపాల్,దామోదర్,వెంకట్ రఘు,భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.