UPDATES  

 ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కార్మికుల సమ్మెకు ఐఎఫ్ టి యు సంపూర్ణ మద్దతు యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్.

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 30
, మణుగూరు సింగరేణి ఏరియా ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు,దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ప్రధాన డిమాండ్లుగా గత ఆరు రోజులుగా కొనసాగుతున్న కార్మికుల నిరవధిక సమ్మెకు ఐఎఫ్ టీయూ శ్రేణులు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.సోమవారం ఉదయం సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ సమీపంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కార్యాలయం ఎదురుగా కాంట్రాక్ట్ కార్మికుల నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని ఐ ఎఫ్ టి యు నాయకులు సందర్శించారు.ఈ సందర్భంగా మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ దీక్షలో కూర్చున్న కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు,ఇంటి కిరాయిలు,పిల్లల చదువులు,వైద్యం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో ధర్నాలు,రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వాలు,ప్రభుత్వ రంగ సంస్థలు,చివరికి ప్రైవేటు సంస్థలు కూడా నామమాత్రంగా కూడా స్పందించకపోవడం బాధాకరం అన్నారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లని సింగరేణి మధ్యవర్తిత్వంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సింగరేణి అధికారులను,కేంద్ర కార్మిక శాఖ అధికారులను ఆయన కోరారు.ఈ సందర్భంగా సమ్మె దీక్షకు సంఘీభావంగా కొద్దిసేపు ఐఎఫ్ టియు శ్రేణులు దీక్షా శిబిరంలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కార్మికులు యాకయ్య, ఎర్రయ్య,నరసింహారావు,బాబురావు,బాబు,వెంకటేశ్వర్లు, బుచ్చి రాములు,సత్యం,ఐఎఫ్ టి యు నాయకులు కే. రవికుమార్,వి.శంకర్ నాయక్, సాంబశివరావు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !