మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 30.. పేద ప్రజల సంక్షేమం కోసమే బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అడుగు ముందుకు వేస్తుందని జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని,బుగ్గ గ్రామ పంచాయతీ లో మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,79వ బూత్ ఇంచార్జ్ ముత్యంబాబు అధ్యక్షతన 79వ బూత్ లెవల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశం లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను అమలు చేస్తుంది అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందని అన్నారు.బుగ్గ గ్రామానికి రూ.2 కోట్ల రూపాయలతో రహదారికి నిధులు మంజూరు అయ్యాయని,త్వరలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుందామని తెలిపారు. మన గ్రామంలో అనేక మందికి రైతు బంధు,రైతు భీమా, కల్యాణ లక్ష్మీ,ఆసరా పింఛన్లు, సీసీ రోడ్స్ పనులు పూర్తి చేయించుకున్నామని అని తెలియజేశారు.ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎవరేవరో వస్తారని, మాయమాటలు చెప్తుంటారు అని,వారి మాటలు నమ్మకుండా మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు కు,బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలని అన్నారు.బుగ్గ, ఖమ్మంతోగు యూత్ సభ్యులకు రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్,నెట్ లను అందించారు.ఈ కార్యక్రమంలో బుగ్గ సర్పంచ్ తాటి రామకృష్ణ, ఉప సర్పంచ్ బండ్ల కృష్ణ, మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దంగుల కృష్ణ, మడి వీరన్నబాబు,బుగ్గ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి బాలరాజు, వార్డ్ సభ్యులు కుంజా సీతారాములు,కొమరం లలిత, కుంజా నాగమణి,గ్రామ నాయకులు వట్టం సారయ్య, కొమరం మల్లయ్య,వట్టం నారాయణ,తదితరులు పాల్గొన్నారు