పిఆర్సి ఆందోళనను విజయవంతం చేయండి: తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ
మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 30
మణుగూరు లో విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి సాధన కోసం జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఎస్పీఈ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.సోమవారం నాడు జరిగిన సన్నాక సమావేశంలో జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు.ఆందోళనలో భాగంగా బిటిపిఎస్ లో ఫిబ్రవరి 1వ తేదీన ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు.2వ తేదీన హైదరాబాదులోని విద్యుత్ సౌదా ఎదుట ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ ఆందోళన కార్యక్రమాల అనంతరం జెన్కో యాజమాన్య వైఖరిని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగికి ఉందని గుర్తు చేశారు.అనంతరం బి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ బి. బిచ్చన్నకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వి.ప్రసాద్, టీఎస్ పి ఈ ఏ అధ్యక్షులు బి.రవి ప్రసాద్,ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు సిహెచ్.రాజబాబు,నరేష్,కెమిస్ట్రీ అసోసియేషన్ నాయకులు దయాకర్,కార్మిక సంఘం-1104 అధ్యక్షులు హేమ్లా నాయక్, సిఐటియు నాయకులు వీరస్వామి,ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ,కార్మిక సంఘం-1535 నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.