ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 30…. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డులకు సంబంధించి సుమారు 77,8,925 లక్షల రూపాయల 77 మందికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులను స్వయంగా తన చేతిని మీదిగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పేద ఆడపడుచు బిడ్డలకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానని, తన తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, తహసిల్దార్ రామకృష్ణ, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, పరమేష్ యాదవ్, అంబుల వేణు, నలిని జయంతి మసూద్, సుజాత, కూరపాటి విజయలక్ష్మి, గుమ్మడిల్లి కళ్యాణి, వనచర్ల విమల, పల్లపు లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, తంగేళ్ల లక్ష్మణ్, కంచర్ల జమలయ్య, నేరెళ్ల సమైక్య, మునిగడప పద్మ, విజయ్, సత్యనారాయణ చారి, మండల ఆమని, తలుగు అనిల్, భుఖ్య శీను, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు