పత్తి లోడు కు ఫైన్
◆అనుమతి లేకుండావాహనాలలో పత్తి తోలకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
◆బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల.
మన్యం న్యూస్,అశ్వాపురం:అనుమతి లేకుండా పత్తి తోలకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల హెచ్చరించారు.ఆమె సోమవారం
మండలంలోని గొందిగూడెం గ్రామ సమీపాన పత్తి లోడ్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆవాహనానికి మార్కెట్ కమిటీ నుండి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు.వెంటనే ఆ వాహనానికి రూ1900 ఫైన్ విధించారు. అనుమతి లేకుండా వాహనాలలో పత్తి లోడులను తరలిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు.