బడ్జెట్ సమావేశాలలో ఖమ్మం జిల్లా కు యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చెయ్యాలి
* విద్యారంగానికి 30% శాతం నిధులు కేటాయించాలి.
పి. డి. ఎస్. యూ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు సంతకాల నిరసన
*పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్
మన్యం న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి:
ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయినటువంటి జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు విద్యా రంగానికి 30% శాతం నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని డి. ఎస్. యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. పి. డి. ఎస్. యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు సోమవారం సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖమ్మం జిల్లా ప్రజల విద్యార్థుల ఆకాంక్ష , చిరకాల స్వప్నం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 30% శాతం నిధులను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సత్వరమే విడుదల చేసి, జిల్లాకు యూనివర్సిటీ ప్రస్తావన మరియు రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి 30% నిధులు కేటాయించకపోతే పిడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమానికైనా వెనుకాడబొమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డి. ఎస్. యూ జిల్లా నాయకులు సతీష్,కరుణ్ డివిజన్ నాయకులు సాయి, గణేష్, శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.