మన్యం న్యూస్, పినపాక :
తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో జానంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ కిట్లను అంజేశారు. నియోజకవర్గంలో త్వరలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని జానంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు