మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
దేశ ఆర్థిక అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గం అనేది చాలా ముఖ్యమని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అన్నారు. మండలంలోని పర్ణశాల పంచాయతీ పరిధిలో గల గోవిందపురం గ్రామం నుండి బక్క చింతలపాడు గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల దూరం గల బీటీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ రోడ్డు మార్గం ఉంటేనే గ్రామల ఆర్థిక అభివృద్ధి సర్వేజనా సాగుతుందని ఏజెన్సీ ప్రాంతంలో అనేక చోట్ల రోడ్డు రవాణా వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతారని ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణాలు చేపట్టి రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తెల్లం భీమరాజు, కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ, కాంట్రాక్టర్ వెంకటరమణ, తెల్లం ఆదయ్య, నరసయ్య, కంగల భద్రయ్య, గ్రామ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.