మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01.. భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మైనార్టీ మంత్రిత్వ శాఖకు కేవలం 3097.60 కోట్లు కేటాయించి మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం చేశారని… బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అన్వర్ బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను ఆర్థికంగా విద్యాపరంగా తొక్కిపెట్టాలనే మైనారిటీ ఉపకార వేతనాలను రద్దు చేయడంతో పాటు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ద్వారా గత కొన్నేళ్లుగా అందిస్తున్న షీలో ఫిష్ ను కూడా రద్దు చేయడం జరిగిందని, బిజెపి కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క అన్యాయం చేస్తుంది అన్నారు.