మన్యం న్యూస్,పాల్వంచ:
బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (పాల్వంచ) టిఆర్ఏస్వీ (బిఆర్ఎస్వి) రాష్ట్ర కార్యదర్శి చీకటి కార్తీక్ ను రాష్ట్ర కమిటి నుంచి తొలగిస్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు టిఆర్ఏస్వీ (బిఆర్ఎస్వీ)రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనితో ఉమ్మడి జిల్లాలో బి.ఆర్.ఎస్ పార్టీలో ప్రక్షాళన షూరు అయినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
