UPDATES  

 ఇది తెలంగాణ బిడ్డలు తెగింపు నిరుద్యోగ యువకుల మేల్కొల్పే కథ సారాంశం తో

ఇది తెలంగాణ బిడ్డలు తెగింపు
నిరుద్యోగ యువకుల మేల్కొల్పే కథ సారాంశం తో
“రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం” సినిమాను ఆదరించండి
విలేకరుల సమావేశంలో చిత్రం యూనిట్ సభ్యులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01… తెలంగాణ సత్తాను చాటిన కుర్రాళ్ళు వీరు.. కళల కానాచి తెలంగాణ ఖ్యాతిని ఇనుముడింపజేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో చదువుకొని ఉద్యోగాల వేటలో తిరుగుతున్న యువతను కొందరు స్కాముల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని కథ సారాంశంగా తీసుకుని మూడు నెలల పాటు ఏటూరు నాగారం దట్టమైన అడవి ప్రాంతంలో సినిమా తీసిండ్రు. ఈ నెల మూడున బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 థియేటర్లు తెరపైకి ఎక్కిస్తున్నారు . ఇందుకోసం బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చిత్రం యూనిట్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా యొక్క సారాంశాన్ని వివరించారు..”రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం” ఈ సందర్భంగా యువ నటులు మాట్లాడుతూ ఈ సినిమా ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎలాంటి ఇరకాటంలో పడతారు అనే సామాజిక కథాంశంతో  వారధి క్రియేషన్ బ్యానర్ పై రేబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను  తెరకెక్కించినట్లు తెలిపారు. ఈ సినిమా కథాంశం అంతా 2009 లో జరిగిన ఓ జాబ్ స్కాం చూట్టూ నడుస్తుందన్నారు. ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో నివసీంచే నిరుద్యోగ యువకులకు వచ్చే ఓ అవకాశం వల్ల వారు ఎలాంటి చిక్కుల్లో పడతారు… ఆ పరిస్థితుల్లోంచి బయట పడతారా లేదా అనే ఆశక్తికర సన్నివేశాలతో ఉండబోతోందన్నారు. డైరెక్టర్ జైదీప్ విష్ణు రైటర్ సంతోష్ ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ని ఎంతో బ్యాలన్స్ చేస్తూ తీసారని, విలేజ్ బ్యాకడ్రాప్ లో కామిడిని, ఉడ్ స్మగ్లర్ బ్యాకడ్రాప్ లో యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ని కలగలుపుకొని, నక్సల్ బ్యాకడ్రాప్ లో సస్పెన్స్ కామెడీ లాంటి సరికొత్త అంశాలతో ఈ నెల ఫిబ్రవరీ 3న ప్రేక్షకులను ఆకట్టంకోబోతోందని అన్నారు.ఈ కల్పిత కథ తెలంగాణ లో నడుస్తుంది కాబట్టి , తెలంగాణ యాస పట్ల అత్యంత శ్రద్ధతో మాటలను పలికించామన్నారు..
ఏజెన్సీ గ్రామాలను, అడవి అందాలను డి.ఓ.పి శ్రీకాంత్ అర్పుల తన నైపుణ్యంతో అధ్బుతంగా తెరకెక్కించారని, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడంతో తొలిసారి దర్శకత్వం వహించిన జైదీప్ విష్ణు కి, నలభై మంది నూతన నటీనటులుకు, వారి మొట్టమొదటి కల సాకారమైందన్నారు.. మణిశర్మ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అతి పెద్ద హైలైట్ గా నిలువనుందని. యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే థ్రిల్లింగ్ మ్యూజిక్ క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ మ్యూజిక్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించబోతోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలను వింటే ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఈ చిత్రంలోని పాటలను ఎంతో మనసు పెట్టి రాసినట్టు అర్థమైంతోందని అన్నారు. ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అవకాశం కల్పించిన ప్రియదర్శిని కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలేజ్ ప్రిన్సిపాల్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు వంశీ ఊటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్ కె, విజయ్ మచ్చ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్కే నయీమ్ సినిమా ఆటోగ్రఫీ అరకుల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సినిమాలోని నటీనటులు అంతా కొత్తవారే కావడం విశేషం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !