మన్యం న్యూస్,అశ్వాపురం: మండల పరిధిలో ని మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కంటి సమస్యల పరిష్కారానికై సామూహికంగా ఇంటి ముందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షలు చేపించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ వైద్యాధికారి సంకీర్తన, గ్రామపంచాయతీ కార్యదర్శి సైదులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు గ్రామ పెద్దలు , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.