మన్యం న్యూస్,భద్రాచలం:మండల కేంద్రం లోని
భద్రాచలం ఒక హృదయం సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి వాల్ పోస్టర్లను భద్రాచలం ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడకూడదని. ముందస్తు టెస్టులు చేయించుకోవాలని. అలాగే యువత వ్యసనాలకు బానిస అవ్వకూడదని వారు సూచించారు.ముఖ్యంగా స్త్రీలు ముందస్తు టెస్ట్ లు చేయించుకునే అవకాశం వచ్చిందని వారు తెలియపరిచారు.ఒక హృదయం సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. సంస్థ అధ్యక్షులు సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదివేల వాల్ పోస్టర్లను అతికించి దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్నికి అవకాశం కల్పించిన ఏ, ఎస్ ,పి పరితోష్ పంకజ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని సంస్థ తెలియజేసింది. ప్లాస్టిక్ నిషేధించి టొబాకో దూరం పెట్టి. క్యాన్సర్ బారిన పడకుండా విముక్తులు అవ్వాలని సంస్థ తెలియజేసింది .ఈ కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షులు
ఎం.సంజీవరెడ్డి, ట్రెజరర్ పొన్నాల కవిత, సంస్థ కార్యవర్గ సభ్యులు కడాలి నాగరాజు, కుమ్మరపల్లి నాగరాజు , పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.