మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 1: భద్రాచలం నియోజకవర్గ ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇటీవల గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకుని హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వారిని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగ కలసి పుష్పగుచ్ఛం అందజేసి పరామర్శించరు.అనంతరం ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సోయం చిన్నారి,ఊకె ముక్తేశ్వరరావు పాల్గొన్నారు .