మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్ళ పాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం నందు మన ఊరు మన బడి నిధుల నుండి మంజూరీ అయిన అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు బుధవారం ప్రారంభించారు.తొలుత ఎమ్మెల్యే భట్టి ని పాఠశాల విద్యార్థులు,గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పాఠశాల పాలకవర్గం,సిబ్బంది ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆ పాఠశాలవిద్యార్థుల తో కలిసి తరగతి గదులు పరీక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భట్టి మాట్లాడారు.
రంగులేసిన అంత మాత్రాన పాఠశాల అభివృద్ధి అనుకోలేమని,
విద్యార్థులకు సరిపడా బోధనా సిబ్బంది ఉండాలి అని డిమాండ్ చేశారు.విద్య అభివృద్ధి అనేది అంచలంచెలుగా జరుగుతుందని,
నాడు విద్య లేని వాడు వింత పశువు అనే వాళ్ళం.ఉసికెలో దిద్దిన దగ్గర నుండి డిజిటల్ క్లాస్ రూం వరకు వచ్చాం.విద్య,వైద్యం అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని అన్నారు.బోధనా సిబ్బంది లేకుండా విధ్యాబివృద్ధి సాధ్యం కాదని పూర్తిస్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఆళ్ళ పాడు పాఠశాలలోఉన్న విద్యార్థులకు అటు తెలుగు మీడియం,ఇంగ్లీష్ మీడియం ఏక కాలంలో బోధన చేస్తున్న విషయాన్ని గమనించి భట్టి ఈ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. సరిపడా బోధనా,బోధనేతర సిబ్బంది ఉండాలి అప్పుడే పాఠశాలల్లో విద్యాభివృద్ధి జరుగుతుంది అని అన్నారు.రాష్ట్రంలో ని అన్ని
పాఠశాల లకు స్కావెంజర్స్ లు ప్రత్యేకంగా ఉండేలాగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.