మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 01: ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి పేదల గుండెల్లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం ముత్యాలమ్మనగర్ 89వ బూత్ లో కో -అప్షన్ సభ్యులు జావీద్ పాషా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో అనేక మందికి రైతు బందు, రైతు భీమా, కల్యాణలక్ష్మి, షాది ముభారక్, ఆసరా పింఛన్ లు అందుతున్నాయన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగాను అత్యధిక ఓట్ల తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ నగర్, సర్పంచ్ కొమరం జంపేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మడి వీరన్నబాబు, మధార్ హుస్సేన్, కేతా అప్పాజీ , హుస్సేన్ , సోమన్న , కొమరం రాజు, చెలికాని రామక్రిష్ణ, పొదుపుగంటి సునీల్ , సరిత, మొగరం రజిత తదితరులు పాల్గొన్నారు.