మన్యం న్యూస్. ములకపల్లి.ఫిబ్రవరి02.టిపిసిసి అధ్యక్షులు ఏనుమల రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముగించుకొని.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుతూ గురువారం మండలం లోని జగన్నాధపురం గ్రామ పంచాయతీ లో ఉన్న కోట ముత్యాలమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు దయతో పాదయాత్ర దిగ్విజయంగాసాగాలని ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటేటి. నర్సింహా రావు, అశ్వారావుపేట నియోజకవర్గయూత్ ప్రెసిడెంట్ కోరంపల్లి చెన్నారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల. రాంబాబు.బుగ్గరాపు సత్యనారాయణ,సున్నం నాగేష్, సున్నం బాలకృష్ణ, దైవరాజు తదితరులు పాల్గొన్నారు.