మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 03… సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మేరే రవి పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసును ఎత్తివేయాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసంమన్నారు. మండలంలో ఉన్న పోడు రైతు సాగుదారులందరికీ పట్టాలి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తిసత్యం, సర్పంచ్ సీతారాములు, సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్ , పి వై ఎల్ నాయకులు పరిషిక రవి, యాసారపు వెంకన్న, ఈసం కృష్ణ , గడ్డం లాలయ్య, ఎస్.కె అఙ్గర్, బానోత్ లాలు, ముఖ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.