మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి03: సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిందని కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ అన్నారు. ఆయన శుక్రవారం నాలుగేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా మన్యం న్యూస్ తో ముచ్చటించారు. నాలుగేళ్ల పాలన ఎంతో చక్కగా సాగిందన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సారధ్యంలో పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. తన, మన తేడా లేకుండా పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించానన్నారు. ఎవరడిగిన లేదు అనకుండా తోచినంత సహాయం చేశానన్నారు. పంచాయతీలోని ప్రజలు తనను వారి ఇంట్లో కుటుంబ సభ్యుడిలా ఆదరించారని, ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాపై నమ్మకంతో నాకు ఓటు వేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. ఎవరికీ ఎలాంటి కష్టం రాకుండా పంచాయతీ ప్రజలను కాపాడుకుంటానని ఆయన తెలిపారు.
