మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 03: సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి పాల్పడాలని మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం( పిఎసిఎస్) అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు అన్నారు. ఆయన శుక్రవారం పిఎసిఎస్ కార్యాలయంలో డిసిసిబి జిల్లా బ్యాంక్ ఏజీఎం వెంకటేశ్వర్లు తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, రైతుల దగ్గర నుండి రావాల్సిన వడ్డీలు, అసలు తప్పనిసరిగా ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాలన్నారు. ఏ రకమైన రుణాలైనా సకాలంలో చెల్లించినట్లయితే ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీని పొందగలరని అన్నారు. ఈ సమావేశంలో జ్ఞాన దాసు, తాజుద్దీన్, రాఘవులు, శివ, సతీష్ లు పాల్గొన్నారు.