మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 02… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సీనియర్ జర్నలిస్ట్ కాళ్ళారి యతిరాజ్ కుమార్ (ఏబీఎన్ రాజు) ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం పాఠకులకు విధితమే, గురువారం మండల పరిధిలోని ఎల్లంకి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ఏబీఎన్ రాజు సంస్మరణ సభలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. రాజు చిత్రపటానికి పూలమాల లేసి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపా సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, సర్పంచ్ గలిగే సావిత్రి, మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్, కార్యదర్శి నున్న రంగారావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, సీనియర్ నాయకులు వేల్పుల నరసింహారావు, లాకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.