మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 02: తాను ఎలాంటి పార్టీ మారడం లేదని, తనపై చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో ఇటీవల మరణించిన లంకెమళ్ల వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మొండిగుంట గ్రామంలో దొంగల దాడిలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న తునికేసి సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ మారుతున్నానని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తామన్నారు. ఒకవేళ పార్టీ మారవలసి వస్తే తానే స్వయంగా ప్రజల వద్దకు వచ్చి ప్రకటిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఖమ్మం జిల్లా డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కె.వి.రావు, సుబ్బారెడ్డి, రాము, ఆచంట సాయి, చింతల కృష్ణ, సూర రాజు, తమ్మిశెట్టి సాంబ, కటుకూరి శ్రీనివాస్,పాతూరు వెంకన్న, కారం నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.