మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి11: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ లో వీర ముష్టి రాములు ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన దశ దిశ కర్మలకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శేషగిరి నగర్ గ్రామ అధ్యక్షులు వేముల లక్ష్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు సంజీవరావు, కార్యకర్తలు పరాల లింగయ్య, గుంజ సాంబ, దాసరి వెంకట్, బానోత్ రవి, రాములు, భూమయ్య, హరి, బుచ్చయ్య, తాటికొండ రత్నాచారి, ఉదయ్, మాధవి, సుహాసిని, సుప్రియ, జోష్ణ, శాంతి తదితరులు పాల్గొన్నారు.





