UPDATES  

 జర్నలిస్టులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం సోషల్ మీడియాను అధిగమించే స్థాయికి ఎదగాలి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

  • జర్నలిస్టులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
  • సోషల్ మీడియాను అధిగమించే స్థాయికి ఎదగాలి
  • ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే పాత్రికేయులు క్రియేవిటిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సింగరేణి మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న పాత్రికేయుల శిక్షణా తరగతుల్లో ఆదివారం చివరి రోజు ముగిసింది ఈ సందర్భంగ ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్ గౌరీ శంకర్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు బుచ్చన్న, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్ పా బలరాం, జియం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులకు అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రాతి యుగం నుండి నేటి యుగం వరకు సప్తసముద్రాలు దాటిన విషయాన్ని తెలుసుకునే సమయంలో కూడా పాత్రికేయులు ఎంతో సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారని చెప్పారు. వార్తల సేకరణలో పాత్రికేయులు వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. సాంకేతిక అభివృద్ధి చెందిన నేపథ్యంలో పాత ఆలోచనలను మార్చుకుంటూనే కొత్త ఆలోచనలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన పాత్రికేయుల శిక్షణా కార్యక్రమంతో మారుతున్న సమజాంలో పాత్రికేయుల పాత్ర తదితర అంశాలపై వక్తులు ఎన్నో విషయాలపై పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన కల్పించారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోవాలంటే శిక్షణ చాలా అవసరమని చెప్పారు. అన్యాయానికి గురైన బాధితులు పక్షాన న్యాయం జరిగే విధంగా వార్తలు వ్రాయాలని చెప్పారు. అనంతరం పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న పాత్రికేయులకు సర్టిఫికేట్లు, వార్తల సేకరణపై తయారు చేసిన పుస్తకాలను అందచేశారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మేనేజర్ వెంకటేశ్ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్ ,మహమ్మద్ షఫీ, టెంజు అధ్యక్ష కార్యదర్శులు వట్టి కొండ రవి, చింతల నరసింహారావు సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ పెనుగొండ సదానందం, సబ్బతి శివమూర్తి చనుమొలు వెంకటేశ్వర్లు, కాకటి బాబు, సైదులు ,చింతల చిరంజీవి, పిఆర్ఓ వనజ, ఓఎన్డీ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !