మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి12: మణుగూరు మున్సిపాలిటీ శివలింగాపురం గ్రామంలో పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్ తల్లి బోశెట్టి మహాలక్ష్మి మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి ఆదివారం మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు, బీఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్, సీనియర్ నాయకులు ముద్దంగులకృష్ణ, వెంకటయ్య, యువజన నాయకులు గుర్రం సృజన్, జక్కం రంజిత్, పొడుతూరి విక్రమ్, హర్షనాయుడు, చక్రవర్తి, బోయిళ్ళ రాజు, తురక రామకోటి,తోటమల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
